Heat wave : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. జూన్ రెండో వారం ముగుస్తున్నా ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో యూపీ ప్రాథమిక విద్యా మండలి ( Uttar Pradesh Basic Education Council) కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల సెలవుల (Holidays) ను జూన్ 30 వరకు పొడిగించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 16 నుంచి పాఠశాలలు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సెలవులను మరో 15 రోజులు పొడిగించారు. అయితే పాఠశాలల టీచర్లు, ఇతర సిబ్బంది మాత్రం విధులకు హాజరుకావాల్సి ఉంటుందని యూపీ ప్రాథమిక విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు జూన్ 30తో సెలవులు ముగుస్తాయని, జూలై 1న తరగతులు ప్రారంభమవుతాయని యూపీ ప్రాథమిక విద్యామండలి తెలిపింది.