Corona Virus | భారత్‌లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,437, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక నిన్న ఒక్కరోజే తొమ్మిది మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇప్పటి వరకూ 11,967 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Also Read..
Shubhanshu Shukla | జూన్ 19న శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర.. ప్రకటించిన ఇస్రో
PM Modi | రేపటి నుంచి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
Manchu Lakshmi | ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. పోస్ట్ వైరల్