Shubhanshu Shukla | జూన్ 19న శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర.. ప్రకటించిన ఇస్రో
Shubhanshu Shukla | సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
Shubhanshu Shukla | సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10, జూన్ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్ కారణంగా జూన్ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్‌కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ఎక్స్ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది.
Also Read..
“శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా”
“ఆకాశమే హద్దుగా.. శుభాంశు శుక్లా”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

