Shubhanshu Shukla | భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్‌లో భాగంగా రేపు ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు.
ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) శుభాంశుతో వీడియో కాల్లో మాట్లాడారు. రోదసి యాత్రకు వెళ్తున్న శుభాంశుకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. అంతరిక్ష యాత్ర సురక్షితంగా, విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలని ఆకాంక్షించారు. వీరి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన ఫొటోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోదసియాత్రకు సిద్ధమవుతున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతోపాటు అతడి బృందానికి శుభాకాంక్షలు తెలిపింది.
As Group Captain Shubahanshu Shukla prepares to embark on Axiom-4 space mission tomorrow, Chief of the Air Staff and all Air Warriors of IAF wish him and the entire crew of Axiom-4 all the best for a safe and successful trip to the International Space Station. This will add a new… pic.twitter.com/t91lFn6gz5
— Indian Air Force (@IAF_MCC) June 10, 2025
ఈ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8కి, ఆ తర్వాత జూన్ 10కి వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే ఇవాళ సాయంత్రమే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని రేపటికి (జూన్ 11) వాయిదా వేశారు.
Also Read..
Watch: లాస్ ఏంజిల్స్ నిరసనలు కవర్ చేస్తున్న మీడియా.. ఆస్ట్రేలియా జర్నలిస్టుపై పోలీస్ కాల్పులు