వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. అయితే నిరసకారులతోపాటు జర్నలిస్టుపై కూడా పోలీసులు రబ్బరు బుల్లెట్‌తో కాల్పులు జరిపారు. (Australian journalist Shot) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నైన్ న్యూస్ ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు లారెన్ టోమాసి, లాస్ ఏంజిల్స్ నిరసనలపై ఆదివారం లైవ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి ఆమె కాలుపై రబ్బరు బుల్లెట్‌తో కాల్పులు జరిపాడు. ఆమె గాయపడినప్పటికీ లైవ్ రిపోర్ట్‌ను కొనసాగించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, నైన్ న్యూస్ ఈ సంఘటనను ధృవీకరించింది. ‘లారెన్ టోమాసి రబ్బరు బుల్లెట్ బారిన పడింది. లారెన్, ఆమె కెమెరా ఆపరేటర్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనలను కవర్ చేసే వారి ముఖ్యమైన పనిని కొనసాగిస్తారు. జర్నలిస్టులు ఎదుర్కొనే స్వాభావిక ప్రమాదాల గురించి ఈ సంఘటన స్పష్టంగా గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది.
మరోవైపు ఆస్ట్రేలియా విదేశాంగ, వాణిజ్య శాఖ (డీఎఫ్ఏటీ) ఈ సంఘటనను ఖండించింది. ‘జర్నలిస్టులు తమ పనిని సురక్షితంగా చేసుకోగలగాలి. మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల రక్షణకు ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుంది’ అని ప్రకటన జారీ చేసింది.
U.S. Correspondent Lauren Tomasi has been caught in the crossfire as the LAPD fired rubber bullets at protesters in the heart of Los Angeles. #9News
LATEST: https://t.co/l5w7JxixxB pic.twitter.com/nvQ7m9TGLj
— 9News Australia (@9NewsAUS) June 9, 2025
Also Read: