Hajj Yatra | భారతీయులపై నిషేధమని వార్తలు.. తోసిపుచ్చిన విదేశాంగ మంత్రిత్వశాఖ..!
Hajj Yatra | హజ్‌యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
Hajj Yatra | హజ్‌యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలోని సంప్రదాయం ప్రకారం.. హజ్ సమయంలో రద్దీని నివారించడానికి దేశం స్వల్పకాలిక వీసాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, సౌదీ అరేబియా భారత్‌తో సహా అనేక దేశాలకు బ్లాక్ వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిందని పలు నివేదికలు తెలిపాయి. హజ్‌యాత్ర సమయంలో రద్దీని నివారించడానికి స్వల్పకాలిక వీసాలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ, యాత్ర ముగిశాఖ ఈ ఆంక్షలను సైతం తొలగించనున్నారు.
హజ్ సందర్భంగా జూన్ జూన్ 30 వరకు సౌదీ అరేబియా 14 దేశాల వర్క్ వీసాలను రద్దు చేసిందని పలు నివేదికలు తెలిపాయి. ఈ దేశాల జాబితాలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, యెమెన్, మొరాకో, నైజీరియా, ఇథియోపియా, సూడాన్, ట్యునీషియా తదితర దేశాలున్నాయి. ఈ ఏడాది జరుగనున్న యాత్ర కోసం భారత్ నుంచి 1.75లక్షల మంది హజ్‌కు వెళ్లనున్నారు. ఈ సారి భారత్‌కు 1,75,025 మందికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరి 13న ప్రధాన ఒప్పందంపై జెడ్డాలో భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా సంతకం చేశారు. ముస్లింలు చాలా మంది జీవితంలో ఒకసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ యాత్రలో అల్లాను క్షమాపణలు కోరుకుంటారు. అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన వేడి, కఠినమైన నియమాల కారణంగా చాలా మంది హజ్ చేయలేకపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

