న్యూఢిల్లీ : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్‌ని గుర్తించినట్టు స్పేస్ఎక్స్ అధికార ప్రతినిధి ప్రకటించారు.
దీంతో లీకేజ్‌కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ఎక్స్ తెలిపింది.