అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో (Air India Plane Crash) మరణించిన వారి వివరాలు వెల్లడవుతున్నాయి. ఎంటెక్ చదివేందుకు కోటి ఆశలతో లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది. గుజరాత్‌లోని హిమత్‌నగర్‌లో నివసిస్తున్న పాయల్ ఖాతిక్ తండ్రి ఆటో డ్రైవర్. ఇంజినీరింగ్, టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి బ్రిటన్ యూనివర్సిటీలో ఆమె సీటు సంపాదించింది.
కాగా, గురువారం పాయల్ ఖాతిక్ ఎంతో ఉత్సాహంగా తన కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నది. వారికి బై చెప్పి ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. అయితే టేకాఫ్ అయిన నిమిషంలోనే అది ఎత్తు కోల్పోయింది. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై కూలి పేలిపోయింది. ఆ విమానంలోని 241 మంది, ఆ ప్రాంతంలోని వ్యక్తులతో సహా సుమారు 270 మంది ఈ ప్రమాదంలో మరణించారు.
మరోవైపు విమాన ప్రమాదంలో పాయల్ చనిపోవడాన్ని ఆమె కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తమ కుటుంబం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే తొలి వ్యక్తి ఆమెనంటూ కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె చదువు కోసం లోన్ తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా పాయల్ మరణాన్ని ధృవీకరించినట్లు వాపోయారు.
#WATCH | Sabarkantha, Gujarat | Relative of a deceased passenger of AI-171 plane crash, Suresh Khatik says, “…After completing her college, she used to stay with us. Then she wanted to study in London. We took out loans to support her education there…My DNA sample has been… pic.twitter.com/G35tZaWJha
— ANI (@ANI) June 13, 2025
Also Read:
‘తిరిగొస్తానని అమ్మ చెప్పింది’.. విమాన ప్రమాద మృతురాలి కుమార్తె ఎదురుచూపులు
లండన్ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్న విజయ్ రూపానీ