Flight crash : అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం (Flight accident) వందల ఇళ్లలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగులో ఉన్న 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మెడికల్ కాలేజీకి చెందిన మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విమానంలోని 241 మంది మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఆ 10 మంది సిబ్బందిలో మహారాష్ట్రకు చెందిన అపర్ణ మహాదిక్ ఒకరు. ఆమె ఎన్సీపీ ఎంపీ సునీల్ తట్కరేకు బంధువు. మహారాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదితి తట్కరే.. అపర్ణకు వదిన అవుతుంది. ప్రమాదంలో ఆదితి మరణించడంతో.. ఇటీవలే ఓ బర్త్డే పార్టీలో ఆమెను కలిసిన విషయాన్ని ఆదితి తట్కరే గుర్తుచేసుకున్నారు.
అయితే ప్రమాదంలో ఆదితి తట్కరే ప్రాణాలు కోల్పోయినా ఈ విషయాన్ని చిన్నారి అయిన ఆమె కూతరుకు ఇంకా తెలియజేయలేదు. దాంతో తల్లితో మాట్లాడేందుకు ఆ చిన్నారి మాటిమాటికి తన తల్లికి ఫోన్ చేస్తుండటం చూపరులను కంటతడిపెట్టిస్తోంది. ‘తిరిగొస్తానని అమ్మ చెప్పింది’ అంటూ ఆ బాలిక అమాయకంగా ఎదురుచూస్తుండటం కలచివేస్తుంది. డీఎన్ఏ శాంపిల్స్ సరిపోలే వరకు బాలికకు విషయం చెప్పవద్దనే ఉద్దేశంతోనే చెప్పలేదని ఆదితి తట్కరే తెలిపారు.