IAS Salary | స్వీపర్ జీతం 2 లక్షలు.. ఐఏఎస్‌ల కంటే కూడా విద్యుత్ శాఖ అధికారులకే ఎక్కువ వేతనాలు.. సీఎస్ రామకృష్ణారావు సంచలన వ్యాఖ్యలు!
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వీపర్లు) నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నట్టు తెలిపారు.
IAS Salary | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వీపర్లు) నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తురంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒక్కో చీఫ్ ఇంజినీర్ నెలకు గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై నిర్వహించిన సదస్సులో సీఎస్ పై సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రభుత్వరంగంలోని కొన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు.. ఐఏఎస్ అధికారులు, గవర్నర్ వేతనం కంటే కూడా ఎకువగా ఉంటుందని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో వేతనాలు, పెన్షన్ల కోసం అయ్యే నెలవారీ ఖర్చు రూ.1,500 కోట్లు ఉండగా, ఇప్పుడు అది నెలకు రూ.6,000 కోట్లకు చేరుకున్నదని వివరించారు. గడిచిన దశాబ్ద కాలంలో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు 300 శాతం పెరిగిందని చెప్పారు.
ఎన్నికల సమయంలో వరుసగా ప్రకటించిన వేతన సవరణలే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ పరిధిలోకి రాని అప్పులను అరికట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. విచక్షణారహితంగా అమలు చేసే సబ్సిడీ పథకాలు దీర్ఘకాలిక అభివృద్ధి, మూలధన వ్యయంపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం విధిస్తున్న సెస్, సర్‌చార్జీ వల్ల రాష్ర్టాలకు దకాల్సిన అసలు ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయని తెలిపారు.
వ్యవస్థ వద్దు: దువ్వూరి, మాంటెక్‌సింగ్
కేంద్ర, రాష్ర్టాల మధ్య పోరాట సమాఖ్య వ్యవస్థ కాకుండా, సహకార, ఆరోగ్యకరమైన పోటీతో కూడిన సమాఖ్య వ్యవస్థ ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సు బ్బారావు, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య వ్యయం, అప్పులు, వనరుల సేకరణలో పెరుగుతున్న అంతరాలను తక్షణమే పరిషరించాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణం గా ఆర్థిక సంఘం తన పనితీరును మార్చుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థలకు ని ధుల కొరత వల్ల పట్టణ మౌలిక సదుపాయా ల అభివృద్ధి కుంటుపడుతున్నదని తెలిపారు. మనదేశం తన వైవిధ్యతను కాపాడుకుంటూనే ఏక కేంద్ర, వికేంద్రీకరణ లక్షణాలను చకగా మిళితం చేసిందని పేర్కొన్నారు. సదస్సులో సెస్ డైరెక్టర్ రేవతి, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ, ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్, ఆర్బీఐ డైరెక్టర్ అత్రి ముఖర్జీ, 15వ ఆర్థిక సంఘం సభ్యుడు ఏఎన్ ఝా, వక్త కరణం గాయత్రి ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

