నల్లమలసాగర్‌కు అడ్డు చెప్పొద్దు!
అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్తున్నారు.
- చంద్రబాబు నోట మళ్లీ సుద్దపూస మాటలు
- కాళేశ్వరాన్ని ఆయన ఏనాడూ అడ్డుకోలేదట!
- తెలంగాణ ప్రాజెక్టులకు మోకాలడ్డింది ఎవరు?
- అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిందెవరు?
- కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు వేసిందెవరు?
- తెలంగాణ హక్కులకు గండికొడ్తూ ఏపీ ప్రాజెక్టు అయినా సరే, అడ్డుకోవద్దంటూ నీతి వాక్యాలు!
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో సాగునీటిరంగం, నల్లమల సాగర్‌పై గురువారం జరిగిన చర్చ సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రాజెక్టులపై తన కపట ప్రేమను ఒలకబోశారు. తాము తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డుచెప్పలేదని బుకాయించారు. ముఖ్యంగా గోదావరి జలాలపై తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏనాడూ అడ్డు చెప్పలేదని నమ్మబలికారు. కాబట్టి, ఇప్పుడు నల్లమలసాగర్‌కు తెలంగాణ అడ్డు చెప్పొద్దని వ్యాఖ్యానించారు.
నల్లమలసాగర్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, వృథాగా సముద్రంలోకి వెళ్లే జలాలనే తరలిస్తామంటూ అరిగిపోయిన రికార్డునే మళ్లీ వినిపించారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రలు, కోర్టులో వేసిన పదుల సంఖ్యలో కేసులను గుర్తు చేస్తున్నారు. ఈ కేసులన్నీ ఎవరు వేశారని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా జనవరి 30న ఢిల్లీలో జరిగిన నిపుణుల కమిటీ భేటీలోనూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్మింది. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకూ తాము ఒప్పుకొనేది లేదని వాదించింది. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని కూడా వాదించింది. అంతేకాకుండా గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా తాము అంగీకరించబోమని కొర్రీలు పెట్టింది. గోదావరిలో ఏపీకే ఎక్కువ వాటా దక్కాలని వాదించింది. ఇలా ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ, వాటిని అడ్డుకుంటూనే మరోవైపు కపట ప్రేమ నటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

