అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. గాయపడిన మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో గాయపడిన 71 మందిని అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు వీరిలో ముగ్గురు మరణించారు. కొందరికి చికిత్స కొనసాగుతున్నది. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో 7 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. జైడస్, అపోలో సహా గుజరాత్‌లోని పలు ఆసుపత్రులలో మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడి ఆసుపత్రిలో చేరిన బీజే మెడికల్ కాలేజీ విద్యార్థుల్లో ఎవరూ కూడా మరణించలేదని డాక్టర్ జోషి స్పష్టం చేశారు.
కాగా, గాయాల నుంచి కోలుకున్న కొందరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ కూడా కోలుకున్నాడు. దీంతో మంగళవారం రాత్రి 7:30 గంటలకు అతడ్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు అదే విమానంలో ప్రయాణించి ప్రమాదంలో మరణించిన రమేష్ సోదరుడు అజయ్ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న అతడి కుటుంబానికి అప్పగించారు. బుధవారం డయ్యూలో జరిగిన సోదరుడి అంత్యక్రియల్లో రమేష్ పాల్గొన్నాడు. సోదరుడి పాడేను కూడా మోశాడు.
Also Read:
Court Sentences 2 Congress MLAs | 11 ఏళ్ల నాటి కేసులో.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష