అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మరో 33 మంది మృతుల గుర్తింపు, వారి మృతదేహాల అప్పగింత ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురి డీఎన్ఏ పరీక్షలు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు. 15 మృతదేహాల గుర్తింపు కోసం కుటుంబ సభ్యుల నుంచి అదనపు నమూనాలు సేకరించాల్సి ఉన్నదని అన్నారు. మరో 10 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు.
కాగా, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు విదేశీయుల మృతదేహాలను వారి దేశాలకు పంపించారు. 11 మృతదేహాలను గుజరాత్ బయట ఉన్న ఇతర రాష్ట్రాలకు తరలించారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించిన 202 మృతదేహాల్లో ఎక్కువగా రోడ్డు మార్గం ద్వారా గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు అంబులెన్స్‌లో పంపారు. విమానంలో ప్రయాణించి మరణించిన వారిలో 123 మంది భారతీయులు, 27 మంది బ్రిటన్ జాతీయులు, నలుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ ఉన్నారు. ప్రయాణికులు కాని నలుగురు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరణించారు.
Also Read:
Air India | ప్రమాదానికి మూడు నెలల క్రితమే కొత్త ఇంజిన్.. రూ.4 వేల కోట్లకుపైగా బీమా..!