న్యూఢిల్లీ: ధనవంతుల ఇంట్లో దోపిడీకి మహిళా న్యాయ విద్యార్థిని (Woman Law Student) ప్లాన్ వేసింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఫ్రెండ్‌ను ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిర్చింది. మరో మహిళతో కలిసి రెండు రోజుల్లో ఆ ఇంటి నుంచి రూ.30 లక్షలతోపాటు కొత్త మొబైల్ ఫోన్ చోరీ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మోడల్ టౌన్ ప్రాంతంలో నివసించే డాక్టర్ అనిల్ రహేజా ఇంట్లో జూన్ 12న చోరీ జరిగింది. ఇంట్లో కొత్తగా పనిమనిషిగా చేరిన మహిళ మరి కొందరితో కలిసి రూ.30 లక్షలు, మొబైల్ ఫోన్ చోరీ చేసి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు.
కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. పనిమనిషిగా నటించిన 19 ఏళ్ల శిల్పి, దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేసిన 27 ఏళ్ల న్యాయ విద్యార్థిని రజనిని అరెస్ట్ చేశారు. శిల్పి నుంచి రూ.10.07 లక్షల నగదు, మొబైల్ ఫోన్ ఖాళీ బాక్స్, రజని నుంచి రూ.12.5 లక్షల నగదు, చోరీ చేసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు వారిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చోరీలో భాగమైన 25 ఏళ్ల
నేహా సమల్తిని సహరన్‌పూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.50,000 నగదుతోపాటు నేరానికి వినియోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నిందితులైన ముగ్గురు మహిళలు తమ ఆర్థిక అవసరాల కోసం తొలిసారి నేరానికి పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. న్యాయ విద్యార్థిని రజని మాస్టర్ ప్లాన్ వేసిందని చెప్పారు. ఏజెన్సీ ద్వారా తన్వీర్ కౌర్ అనే నకిలీ గుర్తింపు కార్డుతో డాక్టర్ అనిల్ రహేజా ఇంట్లో పనిమనిషిగా శిల్పి చేరిందన్నారు. ముగ్గురు మహిళలు కలిసి 48 గంటల్లోనే రూ.30 లక్షలు, మొబైల్ ఫోన్ చోరీ చేసి పారిపోయినట్లు వెల్లడించారు.
Also Read:
Thieves Ate Noodles | నూడుల్స్ తిని, ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించి.. దర్జాగా చోరీ
Vishwas Kumar Ramesh | విమాన ప్రమాదం నుంచి బతికిన రమేష్ డిశ్చార్జ్.. సోదరుడి అంత్యక్రియలకు హాజరు
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?