అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ (Vishwas Kumar Ramesh) గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి అతడ్ని డిశ్చార్జ్ చేశారు. అదే విమాన ప్రమాదంలో మరణించిన రమేష్ సోదరుడు అజయ్ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి అప్పగించారు. బుధవారం డయ్యూలో అతడి సోదరుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. గాయాల నుంచి కోలుకున్న రమేష్ ఇందులో పాల్గొన్నాడు. సోదరుడి పాడే కూడా మోశాడు.
కాగా, బ్రిటన్ పౌరసత్వం ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్, జూన్ 12న లండన్ వెళ్లేందుకు సోదరుడు అజయ్‌తో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానం కొన్ని క్షణాల్లోనే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలి పేలిపోయింది.
మరోవైపు ఎమర్జెన్సీ డోర్‌కు దగ్గరగా 11ఏ సీటులో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి సోదరుడు అజయ్‌తోపాటు ఆ విమానంలోని మిగతా 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితోపాటు కొందరు మెడికల్ స్టూడెంట్స్, ఇతరులతో సహా 270 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మంటల్లో సజీవ దహనమైన మృతులను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు.
#WATCH | Diu | Lone survivor of AI-171 flight crash, Vishwas Ramesh Kumar, mourns the death of his brother Ajay Ramesh, who was travelling on the same flight
Vishwas Ramesh Kumar is a native of Diu and is settled in the UK. pic.twitter.com/fSAsCNwGz5
— ANI (@ANI) June 18, 2025
Also Read:
Air India | అహ్మదాబాద్ టు లండన్.. ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలు ఆలస్యం
Thieves Ate Noodles | నూడుల్స్ తిని, ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించి.. దర్జాగా చోరీ
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?