Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. గడిచిన 48 గంటల్లోనే 8 ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆయా విమానాలను అధికారులు అత్యవసరంగా ఎక్కడికక్కడ నిలిపేశారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం దాదాపు 3 గంటలు ఆలస్యమైంది (Ahmedabad To London Flight Delayed). ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం 11:40 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉంది. అయితే, మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆలస్యానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, జూన్ 12న లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని బీజే మెడికల్ హాస్టల్‌పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియాకు చెందిన అనేక విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. దీంతో బోయింగ్ 787 విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కొన్ని సర్వీసుల రద్దు తదితర అంశాలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి విమానాల నిర్వహణా సామర్థ్యంపై సమీక్షించింది. అవన్నీ భద్రతా పరమైన తనిఖీలకు అనుగుణంగానే ఉన్నాయని, బోయింగ్ 787 విమానాల నిఘాలో ఎలాంటి పెద్ద భద్రతా సమస్యలు తలెత్తలేదని డీజీసీఏ తెలిపింది.
Also Read..
సమస్యల సుడిలో ఎయిరిండియా!.. 48 గంటల వ్యవధిలో 8 విమానాల్లో సాంకేతిక లోపాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
బోయింగ్ 787 విమానాల్లో భద్రతా సమస్యల్లేవ్
Melodi | మోదీతో మెలోనీ.. ట్రెండింగ్‌లో ‘మెలోడీ’ మూమెంట్