Melodi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది. కెనడాలోని కాననాస్కిస్‌లో 51వ జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సదస్సుకు వెళ్లారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మోదీ, మెలోనీ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోను ఇటలీ ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘మెలోడీ’ (Melodi) హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పలుసార్లు వీరిద్దరి ఫొటోలూ వైరల్ అయిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరి సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. గతేడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సమయంలోనూ వీరి ఫొటో నెటిజన్లు ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి ‘మెలోడీ’ మూమెంట్ వైరల్ అవుతోంది.
Also Read..
Amarnath Yatra | ఈ ఏడాది అమర్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసులు ఉండవు..
Lightning | పిడుగుల వర్షం.. 12 మంది దుర్మరణం
PM Modi: డీప్‌ఫేక్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ