PM Modi: డీప్‌ఫేక్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
PM Modi: డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ జనరేట్ కాంటెంట్‌పై వాటర్ మార్కింగ్ లేదా క్లియర్ డిక్లరేషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆల్బెర్టా: డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రధాని మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ జనరేట్ కాంటెంట్‌పై వాటర్ మార్కింగ్ లేదా క్లియర్ డిక్లరేషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డీప్ ఫేక్ కాంటెంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత సమస్యలను తగ్గించాలని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ విషయంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు గ్లోబల్ గవర్నెన్స్ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోందని, టెక్నాలజీతో అవసరమైన వ్యవస్థను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఏఐ అనేది ఎనర్జీ ఇంటెన్సివ్ టెక్నాలజీ వ్యవస్థగా మారిందని, టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించాలంటే, రెన్యువబుల్ ఎనర్జీ అవసరమన్నారు. సరసమైన, నమ్మదగిన, స్థిరమైన వ్యవస్థలను తీర్చిదిద్దడమే భారతదేశ ప్రాముఖ్యత అని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల ప్రజలకు లబ్ది జరిగితేనే, అప్పుడు దాన్ని విలువైనదని భావిస్తామని, ఇలాంటి అంశాల్లో ఏ దేశాన్ని కూడా వెనక్కి నెట్టాల్సిన అవసరం లేదన్నారు. భారత్ తన టెక్నాలజీని ప్రజాస్వామ్య పరం చేసిందని, దాంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సాధారణ ప్రజల్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ అవసరమని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

