Lightning | బీహార్ (Bihar) రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. వర్షం కారణంగా అనేక చోట్ల పిడుగులు (Lightning) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
బక్సర్‌లో నలుగురు, పశ్చిమ చంపారన్‌లో ముగ్గురు, కతిహార్‌లో ఇద్దరు, కైమూర్, లఖిసరై, సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు (ఒక్కో కుటుంబానికి) ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని సూచించారు.
Also Read..
Corona Virus | దేశంలో 6,483కి పడిపోయిన యాక్టివ్ కేసులు.. 113కి పెరిగిన మరణాలు
Hindi language | హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా