Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus ) కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 300కిపైనే నమోదవుతున్న కేసులు ఇప్పుడు 200లోపే వెలుగు చూస్తున్నాయి. దీంతో క్రియాశీల కేసులు కూడా భారీగా తగ్గాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 163 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 65 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాజస్థాన్‌లో 51 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,483కి పడిపోయింది. అత్యధికంగా కేరళలో 1384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1105, పశ్చిమ బెంగాల్లో 747, కర్ణాటకలో 653, ఢిల్లీలో 620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 113కి పెరిగింది.
Also Read..
Hindi language | హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. తప్పనిసరేమీ కాదని స్పష్టీకరణ
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా