PM Modi | ఇటీవలే భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనపై మోదీ (PM Modi) మౌనం వీడాలని, ఆయన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని తొలిసారి స్పందించారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు (G7 Summit)కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్నపలంగా ట్రంప్ కెనడా నుంచి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ప్రధాని మోదీ.. ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు.
భారత్-పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌తో ప్రధాని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) వెల్లడించారు. దాదాపు 35 నిమిషాల పాటూ ఇద్దరూ ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను ట్రంప్‌కు మోదీ వివరించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ వివరించారు.
Also Read..
India – Canada | దౌత్యవేత్తల పునర్ నియామకానికి భారత్-కెనడా మధ్య కుదిరిన అంగీకారం
Hypersonic Missile: హైపర్సోనిక్ మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్.. యుద్ధం మొదలైందన్న ఖమేనీ
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడొద్దు!.. ఇజ్రాయెల్ సైబర్ దాడుల భయాల నేపథ్యంలో అధికారులకు ఇరాన్ ఆదేశాలు!