టెహ్రాన్: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా అలీ ఖమేనీ.. యుద్ధం మొదలైనట్లు ప్రకటించారు. ఇజ్రాయిలీల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణుల(Hypersonic Missile)ను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది ఇరాన్. రాత్రి సుమారు 12.40 నిమిషాల సమయంలో సుమారు 15 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయిల్‌పై పడ్డాయి. మరో 40 నిమిషాల తర్వాత 10 రాకెట్లు కూడా ఇజ్రాయిల్ వైపు దూసుకెళ్లాయి. సెంట్రల్ ఇజ్రాయిల్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ శరణార్థి కేంద్రాల్లో అర్థరాత్రి అలర్ట్ జారీ చేశారు.
మిస్సైళ్ల దాడి జరుగుతోందని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ తమ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. సెంట్రల్ ఇజ్రాయిల్‌లోని ఓ పార్కింగ్ లాట్‌పై భారీగా బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో భారీ సంఖ్యలో కార్లు ధ్వంసం అయ్యాయి. హైపర్సోనిక్ మిస్సైళ్లను వాడినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించారు. ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్లో భాగంగా ఫతాహ్-1 మిస్సైళ్లను వాడినట్లు ఇరాన్ వెల్లడించింది. ఆ దేశానికి చెందిన ప్రభుత్వ టీవీ దీనిపై ప్రకటన చేసింది. ఇరానీ దళాలు వైమానిక క్షేత్రాన్ని సంపూర్ణంగా ఆధీనం చేసుకున్నట్లు చెప్పింది.
సోషల్ మీడియా అకౌంట్లలో ఫతాహ్-1 మిస్సైల్ దాడికి చెందిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. హైపర్సోనిక్ ఫతాహ్ మిస్సైల్ సుమారు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చిత్తు చేయగలదు. మాక్ 15 ధ్వని వేగంతో అది దూసుకెళ్లుతుంది. అంటే ధ్వని వేగం కన్నా 15 రెట్లు అధిక స్పీడ్‌తో ఆ మిస్సైల్ ప్రయాణిస్తుంది. టెల్ అవివ్ను టార్గెట్ చేస్తూ.. హైపర్సోనిక్ మిస్సైళ్లను ఇరాన్ వదిలింది. కేవలం 4 నిమిషాల్లోనే ఆ మిస్సైల్ టార్గెట్‌ను చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను ఫతాహ్ దాటి వెళ్లినట్లు భావిస్తున్నారు.
Iran launches Hypersonic Fattah-1 with Mach 13 speed and a range of 1400km.
It reached the target in 5 min and whizzed past Israel’s defense systems and took out the target. Spectacular impact.#IranIsraelConflict #Iran #Israel #IsraeliranWar #IsraelIranConflict #IranIsrael pic.twitter.com/NaeJfHnPIJ
— Muhammad Hasnain Shah (@ahsankazmi2) June 18, 2025