Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ మిషన్‌ను జూన్ 19న చేపట్టనున్నట్లు గత వారం ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది.
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ మిషన్‌ను జూన్ 19న చేపట్టనున్నట్లు గతవారం ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది. ఈ విషయాన్ని అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే చేపట్టిన మరమ్మతులు, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకని జూన్ 22ను తదుపరి ప్రయోగ తేదీగా ఫిక్స్ చేసినట్లు యాక్సియం వెల్లడించింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, సాంకేతిక కారణాలతో యాక్సియం-4 ప్రయోగం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10, జూన్ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్ కారణంగా జూన్ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్‌కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ఎక్స్ తెలిపింది. ఆ తర్వాత ప్రయోగాన్ని జూన్ 19 చేపట్టున్నట్లు ఇస్రో ప్రకటించినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది.
Also Read..
India – Canada | దౌత్యవేత్తల పునర్ నియామకానికి భారత్-కెనడా మధ్య కుదిరిన అంగీకారం
Hypersonic Missile: హైపర్సోనిక్ మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్.. యుద్ధం మొదలైందన్న ఖమేనీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

