హైదరాబాద్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన 55వ అంతర్జాతీయ ఎయిర్ షోలో హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ ఏరోస్పేస్ (Raghu Vamsi Aerospace) సంస్థ సత్తా చాటింది. భారత తొలి జెట్-పవర్డ్ కామికేజ్ యూఏవీని ఆవిష్కరించింది. డీప్ టెక్ బ్రాండ్ ఏరోబాట్ కింద దీనిని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రా 100గా పిలిచే యూఏవీ డ్రోన్ భారత రక్షణ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది. 200 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసే ఈ డ్రోన్ 450 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. నియంత్రణ, ప్రొపల్షన్, టెలిమెట్రీతో సహా పూర్తి స్వదేశీ సాంకేతికతో దీనిని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో దేశ రక్షణలో భాగమయ్యే ఈ డ్రోన్ పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో విజయవంతమైనట్లు ఆ సంస్థ తెలిపింది.
కాగా, భారత ఏరోస్పేస్ టెక్నాలజీతోపాటు, హై-ప్రెసిషన్ డ్రోన్ తయారీలో అగ్రగామిగా రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ రాణిస్తున్నది. డిఫెన్స్, ప్రొపల్షన్ టెక్నాలజీలను కూడా పారిస్ ఎయిర్ షోలో ఆవిష్కరించింది. స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్లు, కామికేజ్ డ్రోన్లను ప్రదర్శించింది. అమెరికా, బ్రిటన్ సంస్థల టేకోవర్‌తో గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థగా రఘువంశీ ఏరోస్పేస్ బలోపేతమవుతున్నది. స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్లు భారత ఏరోస్పేస్ ప్రొపల్షన్‌లో చారిత్రక ముందడుగని రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ తెలిపారు. ఏళ్ల నాటి పరిశోధన, అభివృద్ధి, తయారీ, ఖచ్చితత్వం, రక్షణ సాంకేతికలో స్వావలంబనకు నిదర్శమని అన్నారు.
Raghu Vamsi Aerospace
మరోవైపు హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ పార్క్‌లో 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను రఘువంశీ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్నది. గ్లోబల్ ఓఈఎంల కోసం ఖచ్చితత్వ మ్యాచింగ్, క్షిపణి వ్యవస్థల సబ్ అసెంబ్లీ యూనిట్లు, ఇంజిన్ల తుది అసెంబ్లీ, యూఏవీ, మానవరహిత గ్రౌండ్ వాహనాల తయారీ వంటి ప్రత్యేక విభాగాలు ఇందులో ఉంటాయి. 2026లో ఈ ప్లాంట్ ప్రారంభమై పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించడంతోపాటు దేశీయ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
Also Read:
Vishwas Kumar Ramesh | విమాన ప్రమాదం నుంచి బతికిన రమేష్ డిశ్చార్జ్.. సోదరుడి అంత్యక్రియలకు హాజరు
Thieves Ate Noodles | నూడుల్స్ తిని, ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించి.. దర్జాగా చోరీ