న్యూఢిల్లీ : కరోనా టీకా వ్యూహాన్ని సరళీకృతం చేయడంతో పాటు వ్యాక్సిన్ తయారీదారులకు గ్రాంట్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ అందించే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న కేంద్రీకృత పంపిణీ విధానంతో రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. సగం వ్యాక్సిన్ నిల్వలను.. నేరుగా రాష్ట్రాలకు సగం వ్యాక్సిన్ నిల్వలను నేరుగా రాష్ట్రాలకు సరఫరాచేసే అధికారాన్ని తయారీదారులకు కల్పించింది. ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం బహిరంగ మార్కెట్లోకి టీకాను విడుదల చేసుకోవడానికీ అవకాశమిచ్చింది. అలాగే టీకా తయారీ సంస్థలపైన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌కు సైతం ఆర్థిక సాయం ప్రకటించింది.
సీరం కంపెనీకి రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొతాలు త్వరలోనే విడుదలవుతాయని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. టీకా ఉత్పత్తిని నెలకు పది కోట్లకుపైగా డోసులు పెంచేందుకుగాను రూ.3వేల కోట్ల గ్రాంటు మంజూరు చేయాలని సీరం సీఈఓ అదర్ పూనావాలా విజ్ఞప్తి చేసిన కొన్నిరోజులకే కేంద్రం సానుకూలం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
On behalf of the vaccine industry in India, I would like to thank and applaud Shri @narendramodi Ji, @nsitharaman Ji, for your decisive policy changes and swift financial aid which will help vaccine production and distribution in India. https://t.co/NedjaFLsx9
— Adar Poonawalla (@adarpoonawalla) April 20, 2021