నేటి నుంచి ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం
ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం |

హైదరాబాద్ : ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే రూ.2 వేల ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారితో ప్రైవేటు పాఠశాలలు మూతపడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ అండగా నిలిచి, రూ.2వేలు, కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఈ నెల 24 వ తేదీవరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. 33 జిల్లాల పరిధిలో మొత్తం 1, 24,704 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.
వీరిలో 1,12, 048 మంది టీచర్లు ఉండగా, 12,636 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఆదివారం వరకు 1,18,004 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల నుంచి మరికొంత మందిని ఎంపికచేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,24,704కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి నేటి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. బుధవారం నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉంచింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన
20.01.2021 మంగళవారం, మీ రాశిఫలాలు
భారత్లో మూడో విడుత కిన్లికల్ ట్రయల్స్ కోసం జేఅండ్జే దరఖాస్తు
భారత్కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా సూచన
టీకా తయారీదారులతో నేడు ప్రధాని భేటీ
తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా కేసులు
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

