Viral news : సాధారణంగా ప్రజల సమస్యలు వినేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తే.. తమకు తాగునీటి సౌకర్యం లేదనో.. విద్యుత్ సౌకర్యం లేదనో.. లేదంటే రోడ్లు సరిగా లేవనో.. సంక్షేమ పథకాలు అందడం లేదనో ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ రాజస్థాన్ (Rajastan) లోని బర్మేర్ జిల్లా (Barmer district) లో ఓ గ్రామానికి చెందిన మంగీలాల్ (Mangi Lal) అనే వ్యక్తి వింత కోరిక కోరాడు. తనకు హెలికాప్టర్ (Helicaptor) సమకూర్చాలని అడిగాడు. దాంతో అధికారులు షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బర్మేర్ జిల్లా కలెక్టర్ టీనా దాబి ప్రజల సమస్యలు వినేందుకు జిల్లా కేంద్రంలో జనవరి 28న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. అందరూ వారివారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంగీలాల్ కూడా తన సమస్యను విన్నవించాడు. ‘మేడం నేను నా ఇంటి నుంచి రాకపోకలు సాగించేందుకు హెలికాప్టర్ కావాలి’ అని అడిగాడు. దాంతో కలెక్టర్‌తో సహా ఆ సమావేశంలో ఉన్న అధికారులు, ప్రజలు కంగుతిన్నారు.
ఇదేం వింత కోరిక అని ఆశ్చర్యపోయారు. ఇంతలో కలెక్టర్ టీనా దాబి కలుగుజేసుకుని ‘హెలికాప్టర్ ఎందుకు..?’ అని ప్రశ్నించారు. దాంతో ఆ వ్యక్తి బదులిస్తూ.. ‘గ్రామంలో కొందరు రైతులు మా ఇంటికి వెళ్లే మార్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. అందుకే హెలికాప్టర్ సమకూరిస్తే.. రోజూ హెలికాప్టర్లో రాకపోకలు సాగిస్తా’ అని చెప్పాడు.
దాంతో మంగీలాల్ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందని అర్థం చేసుకున్న కలెక్టర్ టీనా దాబి.. సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆక్రమణలను తొలగించి సదరు వ్యక్తి ఇంటికి దారి ఇవ్వాలని సబ్ కలెక్టర్ బద్రినారాయణను ఆదేశించారు. దాంతో సబ్ కలెక్టర్ బద్రినారాయణ కేవలం మూడు రోజుల్లోనే సమస్యను పరిష్కరించారు. రైతులతో మాట్లాడి ఆ ఆక్రమణలను తొలగింపజేశారు. మంగీలాల్ ఇంటికి బాట సౌకర్యం కల్పించారు.
VISA rules | భారత ఐటీ నిపుణులకు శుభవార్త.. న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో సడలింపు
VISA rules | భారత ఐటీ నిపుణులకు శుభవార్త.. న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో సడలింపు
Salwan Momika | 2023లో ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన వ్యక్తి దారుణ హత్య..!
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్‌గా హర్‌ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు