Vehicle Falls Into Gorge | లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు
Vehicle Falls Into Gorge | మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పింది. లోతైన లోయలో అది పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
డెహ్రాడూన్: మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పింది. లోతైన లోయలో అది పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. (Vehicle Falls Into Gorge) ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఘన్సాలిలోని త్యోల్ధర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించాడు. సుమారు పది మంది గ్రామస్తులు హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, బోలెరో క్యాంపర్ వాహనంలో గ్రామానికి వారు తిరిగి వెళ్తున్నారు. గురువారం చంబా ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ఆ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లోతైన లోయలో అది పడిపోయింది. ఆ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. వారి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Also Read:
Watch: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పెద్ద ఏనుగు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chamba
- Falls Into
- Gorge
- Injured
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

