ముంబై: పుట్టింట్లో ఉంటున్న భార్యను పంపేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తి వారి ఇంటికి నిప్పుపెట్టాడు. వేసవి కావడంతో ఆ మంటలు వ్యాపించి పొరుగువారి ఇల్లు కూడా కాలిపోయింది. (Man Sets In-Laws’ House On Fire) మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భర్త మిథున్ పద్వితో గొడవ కారణంగా అతడి భార్య కొంతకాలంగా పుట్టింట్లో నివసిస్తున్నది.
కాగా, తన భార్యను తిరిగి తీసుకెళ్లేందుకు మిథున్ పలుమార్లు అత్తమామల ఇంటికి వెళ్ళాడు. అయితే ప్రతిసారీ ఆమెను అతడితో పాటు పంపడానికి వారు నిరాకరించారు. పదేపదే ఇలా జరుగడంతో మిథున్ తీవ్ర ఆగ్రహం చెందాడు. అత్తమామల ఇంటికి నిప్పుపెట్టి పారిపోయాడు.
మరోవైపు వేసవి కావడంతో మంటలు తీవ్రమయ్యాయి. క్షణాల్లోనే పొరుగున నివసించే సుభాష్ వాల్వీ ఇంటికి కూడా మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో అత్త ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన మిథున్ కోసం వెతుకుతున్నారు.
Also Read:
UP bureaucrat | సాయుధ గన్మ్యాన్తో ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన కలెక్టర్.. అర్చకులు నిరసన
Watch: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పెద్ద ఏనుగు.. తర్వాత ఏం జరిగిందంటే?