డెహ్రాడూన్: ఒక జిల్లా కలెక్టర్ ప్రముఖ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సాయుధ గన్‌మ్యాన్‌తో కలిసి గర్భగుడిలోకి ప్రవేశించారు. ఇది గమనించిన ఆలయ అర్చకులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. (UP bureaucrat) సాయుధ భద్రతా సిబ్బందితో కలిసి అధికారులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడం నిషేధమని తెలిపారు. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా కలెక్టర్ అవినాష్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ అల్మోరాలోని ప్రసిద్ధ జాగేశ్వర్ ధామ్‌ను సందర్శించారు. అక్కడ నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ రక్షకుడితో కలిసి ఆలయంలోని గర్భగుడిలోకి ఆయన ప్రవేశించారు.
కాగా, ఆ ఆలయంలోని అర్చకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కలెక్టర్ తన గన్‌మ్యాన్‌తో కలిసి గర్భగుడిలోకి ప్రవేశించడంపై నిరసన తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో సహా ప్రముఖులు ఎవరూ కూడా ఆయుధాలు కలిగిన సిబ్బందితో గర్భగుడిలోకి ప్రవేశించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాజా సంఘటనపై దర్యాప్తు చేయాలని పూజారులు డిమాండ్ చేశారు.
మరోవైపు ఆలయ అధికారులు దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే దేవాలయ ప్రాంగణంలోకి ఆయుధాలను తీసుకువెళ్లడాన్ని నిషేధిస్తూ ఒక హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు.
Also Read:
Nashik godman | దైవ శక్తులున్నాయంటూ మహిళపై అత్యాచారం.. మరో నాసిక్ బాబాపై కేసు నమోదు
Man sets Wife on fire | ఎల్లప్పుడూ భార్య నైటీ ధరించడంపై భర్త ఆగ్రహం.. కిరోసిన్ పోసి నిప్పంటించాడు