బెంగళూరు: భార్య ఎల్లప్పుడు నైటీ ధరించడంపై భర్త ఆగ్రహించాడు. ఇంట్లో ఉన్నప్పుడు చీర ధరించకపోవడంపై పలుసార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో జరిగిన వాగ్వాదంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. (Man sets Wife on fire) కర్ణాటకలోకి బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖానాపూర్ తాలూకా నంద్‌గడ్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల కృష్ణ పాటిల్, 32 ఏళ్ల మంజుల భార్యాభర్తలు.
కాగా, భార్య ఇంట్లో ఎప్పుడూ చీర ధరించకుండా పగలు, రాత్రి నైటీ ధరించడంపై భర్త కృష్ణ పాటిల్ ఆగ్రహించాడు. ఈ విషయంపై పలుసార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఏప్రిల్ 21న రాత్రి వేళ ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన కృష్ణ పాటిల్ భార్య మంజులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు 80 శాతం కాలిన గాయాలయ్యాయి.
మరోవైపు మంజులను తొలుత బెళగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గోవాలోని హాస్పిటల్‌కు తరలించారు. భర్త కృష్ణ పాటిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Nashik godman | దైవ శక్తులున్నాయంటూ మహిళపై అత్యాచారం.. మరో నాసిక్ బాబాపై కేసు నమోదు
Watch: వధువు వీడ్కోలు చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్.. తర్వాత ఏం జరిగిందంటే?