చండీగఢ్: పెళ్లి తర్వాత వీడ్కోలు కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్ బిజీ అయ్యాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరిపడ్డాడు. (Cameraman Thrown 25 mts In Air) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని సిర్సాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 6.28 గంటల సమయంలో పెళ్లి కార్యక్రమాన్ని ఫొటోషూట్ చేసేందుకు ఫొటోగ్రాఫర్ నిమగ్నమయ్యాడు. రోడ్డుపై నిల్చొన్న అతడు భావోద్వేగభరితమైన వధువు వీడ్కోలు క్షణాన్ని కెమెరాలో బంధించడంపై దృష్టిసారించాడు.
కాగా, ఒక కారు వేగంగా ఆ రోడ్డుపైకి దూసుకొచ్చింది. గమనించిన కొందరు పెళ్లి వారు ఫొటోగ్రాఫర్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. వేగంగా దూసుకువచ్చిన కారు ఆ ఫొటోగ్రాఫర్‌ను ఢీకొట్టింది. దీంతో 25 మీటర్ల ఎత్తు వరకు గాలిలోకి ఎగిరిపడ్డాడు. అదుపుతప్పిన ఆ కారు ఢివైడర్‌ను ఢీకొట్టింది.
మరోవైపు ఇది చూసి పెళ్లి వారు షాక్ అయ్యారు. వెంటనే ఆ ఫొటోగ్రాఫర్ వద్దకు పరుగెత్తుకుని వెళ్లారు. ఆ కారును చుట్టుముట్టారు. అయితే ఫొటోగ్రాఫర్ పరిస్థితి ఏమిటన్నది తెలియలేదు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా నిరోధించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హర్యానా పోలీసులను ట్యాగ్ చేశారు.
#SHOCKING : A wedding farewell ceremony turned tragic in Sirsa when a speeding hatchback lost control and rammed into a group of family members and guests.
The incident occurred during the bride’s vidai, as relatives had gathered for photographs. Several people were injured.… pic.twitter.com/RY2swsMwsF
— upuknews (@upuknews1) April 22, 2026
Also Read:
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
G Parameshwara | కబడ్డీ ఆటలో పందెం కాసిన హోంమంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Cops Steal Jewellery | వ్యాపారి ఇంట్లోకి చొరబడి.. నగలు దోచుకున్న పోలీసులు, సస్పెండ్