భోపాల్: కొందరు పోలీసులు ఒక వ్యాపారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఆయనతో దరుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా బంగారు నగలు దొంగిలించారు. (Cops Steal Jewellery) ఆ వ్యాపారి ఫిర్యాదుతో ఆ పోలీసులపై చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. వ్యాపారి గౌరవ్ జైన్, పదవీ విరమణ పొందిన ఏసీపీ రాకేష్ గుప్తా మధ్య ఆర్థిక వివాదం ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక చెక్ బౌన్స్ కేసులో వారెంట్‌ను అమలు చేసేందుకు కొందరు పోలీసులు ప్రయత్నించారు.
కాగా, ఏప్రిల్ 1న రాత్రి 11.40 గంటల సమయంలో ఆరుగురు పోలీసులు వ్యాపారి గౌరవ్ జైన్ ఇంటికి చేరుకున్నారు. డోర్ పగులగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి యజమాని, ఆయన కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను ఆ పోలీసులు చోరీ చేశారు.
మరోవైపు వ్యాపారి గౌరవ్ జైన్ దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసి ఆ పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (జోన్ 2) కుమార్ ప్రతీక్ తెలిపారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
కాగా, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్పై కూడా విచారణ జరుగుతున్నదని ఆ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Indore, MP: Plainclothes policemen allegedly disconnected CCTV outside businessman Gaurav Jain’s home, broke in on a cheque dispute pretext, and stole 22 tolas of gold. Internal CCTV captured them inside. Five officers, including SI, suspended. pic.twitter.com/SWpcltHI9E
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 21, 2026
Also Read:
G Parameshwara | కబడ్డీ ఆటలో పందెం కాసిన హోంమంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
dishonour killing | ఇంట్లో ప్రియుడితో సోదరి.. ఆమెను కొట్టి చంపిన సోదరులు
Watch: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారు దొంగ ప్రయత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?