కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తొలిదశ ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు పెద్ద ఏనుగు వచ్చింది. దానిని చూసి ఓటర్లు భయాందోళన చెందారు. అయితే ఆ ఏనుగు ఎలాంటి ఇబ్బంది, హాని తలపెట్టలేదు. (Elephant Visits Polling Booth) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తొలి దశ ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్ జరుగుతుండగా పెద్ద ఏనుగు వచ్చింది. జితుసోల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రం వద్దకు అది చేరుకున్నది.
కాగా, ఓటు వేసేందుకు వచ్చిన జనం ఆ ఏనుగును చూసి కొంత భయాందోళన చెందారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగలేదు. కొంతసేపు తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో ఆ ఏనుగు వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch: Voters were in for a surprise as an elephant paid a visit to a polling station in Jhargram, #WestBengal. pic.twitter.com/faEM5DWMPh
— Pooja Mehta (@pooja_news) April 23, 2026