బెంగళూరు: కర్ణాటకలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో స్కూల్ విద్యార్థులతో సహా ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. (Explosion In Karnataka) కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మోల్కేరా గ్రామంలోని మోల్గి మారయ్య ఆలయం సమీపంలో రోడ్డు పక్కన పేలుడు సంభవించింది. నడిచి వెళ్తున్న నలుగురు స్కూల్ పిల్లలతో సహా ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద వ్యక్తులైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, పేలుడు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. ఈ పేలుడుకు కారణంపై దర్యాప్తు చేస్తున్నారు. మండే ఉత్పత్తులను నిర్వహించే వ్యక్తి పారవేసే వస్తువులతో కలిపి వాటిని ఉంచడంతో పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ పేలుడులో ఏదైనా నేర కోణం ఉన్నదా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆ గ్రామంలో భయాందోళన రేపింది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read:
Car In Handcuffs | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. కారుకు బేడీలు వేసిన పోలీసులు
Sunetra Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్
Student Murder | ఇన్స్టాగ్రామ్లో యువతితో వివాదం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య