శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 09:20:57

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 5609 కొత్త కేసులు.. 132 మంది మృతి

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 5609 కొత్త కేసులు.. 132 మంది మృతి

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 132గా ఉంది.  సుమారు 5609 క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 112359కి చేరుకున్న‌ది. దీంట్లో యాక్టివ్ కేసులు 63624 ఉన్నాయి. దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3435కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 50 ల‌క్ష‌లు దాటింది. బ్రెజిల్‌లో ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ది.

 logo