Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఉదయం నుంచే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 32.18 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్‌లోనూ 47.92 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించారు.
47.92% voter turnout recorded till 1 pm in the second and final phase of #JharkhandElection2024
32.18% recorded till 1 pm in #MaharashtraElection2024 pic.twitter.com/fhEqcv4w1v
— ANI (@ANI) November 20, 2024
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
US embassy | కీవ్‌లోని ఎంబసీని ఖాళీ చేసిన అమెరికా
Supriya Sule: బిట్ కాయిన్ స్కామ్ ఆరోపణలు కొట్టిపారేసిన సుప్రియా సూలే
Hit And Run | బైక్‌ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు.. జర్నలిస్ట్ మృతి