Hit And Run | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బీఎండబ్ల్యూ (BMW) కారు బైక్‌ను ఢీ కొట్టి కొంత దూరం అలానే ఈడ్చుకెళ్లింది (Hit And Run). ప్రమాదంలో ఓ వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు (Journalist killed). ఈ ఘటన మంగళవారం రాత్రి చెన్నై (Chennai)లో చోటు చేసుకుంది.
పాండి బజార్‌కు చెందిన ప్రదీప్ కుమార్.. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్లో కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. పార్ట్‌టైమ్‌గా రాత్రి సమయంలో ర్యాపిడో డ్రైవర్‌గానూ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి రైడ్‌లో ఉన్న సమయంలో అతడి బైక్‌ను మధురవాయల్ – తాంబరం ఎలివేటెడ్ బైపాస్‌పై వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. అనంతరం అలాగే వంద మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ప్రదీప్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అక్కడ పూర్తిగా ధ్వంసమైన బైక్‌ను గుర్తించారు. ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో కుమార్ డెడ్‌బాడీని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.
Also Read..
Viral Video | అతిథులపై నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన పెళ్లివారు..VIDEO
Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించిన సర్కార్