Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజు రోజుకీ క్షీణిస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి మరింత ఎక్కువగానే ఉంది.
సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (490) స్థాయితో పోలిస్తే మంగళవారం 460తో స్వల్పంగా మెరుగుదల నమోదైంది. ఇవాళ మరో పదిపాయింట్లు మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రమాదకర విభాగంలోనే ఉంది. తీవ్ర వాయుకాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే (Work From Home) అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
‘కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటి నుంచి పనిచేయాలని నిర్ణయించింది. 50 శాతం మంది ఉద్యోగులు (Employees) ఇంటి నుంచి పనిచేస్తారు. దీని అమలు కోసం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’ అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షమే శరణ్యం
కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఇందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంక్షోభంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది.
Also Read..
Assembly elections | మహారాష్ట్రలో నెమ్మదిగా కొనసాగుతున్న పోలింగ్.. 9 గంటల వరకూ ఎంత శాతం అంటే..?
AUS vs IND: సర్ఫరాజ్ ఫీల్డింగ్ చూసి.. పగలబడి నవ్విన కోహ్లీ, పంత్.. వీడియో
Hyderabad | కూకట్పల్లిలో దారుణం.. బాలుడిపై పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నం