పెర్త్: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం అయ్యే తొలి టెస్టు(Aus Vs Ind) కోసం టీమిండియా ఆటగాళ్లు.. పెర్త్ మైదానంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన సీనియర్ క్రికెటర్లు, రెండు రోజులుగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మంగళవారం ఆ ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ స్టయిల్ చూసి కోహ్లీ, పంత్, జురల్ నవ్వుకున్నారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. సర్ఫరాజ్ తన ముఖం వద్దకు చేరుకున్న బంతని క్యాచ్ పట్టాడు. అయితే ఆ క్యాచ్ పట్టిన స్టయిల్‌తో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఫీల్డర్లు తెగ నవ్వుకున్నారు. కోహ్లీ పగలబడి నవ్వుగా, ఇక పంత్ ఏకంగా కిందపడిపోయి గట్టిగా నవ్వేశాడు. సర్ఫరాజ్ కూడా అందరితో ఆ నవ్వుల్లో మునిగిపోయాడు.
What did Sarfaraz do? 🤪🤪 #AUSvIND pic.twitter.com/P2PgQ5KAJX
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) November 19, 2024