హైదరాబాద్ : కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి(Fruit vendor) బాలుడిపై లైంగిక దాడికి(Assault boy) యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కూకట్పల్లిలోని వివేకానందనగర్లో చోటు చేసుకుంది. స్థానికంగా పండ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి బాలుడిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. దీంతో సదరుడు బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారి బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.