IND vs AUS : వేదిక, ఫార్మాట్ ఏదైనా సరే.. ఆస్ట్రేలియా (Australia) జట్టు ఆట మామూలుగా ఉండదు. అదీ సొంతగడ్డపైన సిరీస్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడం ఆజట్టుకు మహా సరదా. అలాంటి కంగారూలనూ కంగారెత్తించిన బ్యాటర్లు చాలా కొద్దిమందే. అందులో సింహభాగం భారత క్రికెటర్లే ఉండడం విశేషం. అవును.. ఆస్ట్రేలియా పర్యటనలో చెలరేగి ఆడుతూ సెంచరీలతో కదం తొక్కతూ రికార్డులు బద్దలు కొట్టింది టీమిండియా ఆటగాళ్లే. ముఖ్యంగా ఆ ఐదుగురు అంటే మాత్రం ఆసీస్ బౌలర్లకు వణుకే.
ఎప్పుడు వెళ్లినా సరే అక్కడి పరిస్థితులకు అలవాటు పడిపోయి.. ఆతిథ్య జట్టులోని వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లను ఉతికేసి.. పరగులు వరద పారించారు వీళ్లు. కొరకరాని కొయ్యలా మారి భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ ఐదుగురు ఎవరో తెలుసా…?
🚨In my opinion, we should shift focus from Ind-Pak rivalry to Ind-Aus clashes, as both teams compete with equal potential. The #BorderGavaskarTrophy hype is also immense this time.
Australia is favored at home but India can give them a tough time.#BGT #INDvsAUS #AUSvsIND https://t.co/sIp19bh6Pm pic.twitter.com/pxH3DIkHuc
— Mr. Incredible 💥 (@MeEngrr) November 19, 2024
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ఇన్నింగ్స్‌లు, మర్చిపోలేని శతకాలతో టీమిండియా గర్వపడేలా చేసిన వాళ్లలో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)ది అగ్రస్థానం. మాస్టర్ బ్లాస్టర్ తర్వాత ‘ది వాల్ రాహుల్’ ద్రవిడ్ కంగారూల పాలిట విలన్‌గా మారాడు. అతడికి తోడుగా తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) సొగసైన షాట్లతో అలరిస్తూ కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ముగ్గురి శకం ముగిసిందని సంబురపడిన ఆస్ట్రేలియన్లకు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది.
మిడిలార్డర్లో ఒకరు విధ్వసంక బ్యాటింగ్ కొనసాగిస్తే.. మరొకరు నింపాదిగా క్రీజలో నిలబడి పరుగులు దొంగిలించేవారు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లకు ఏమాత్రం తీసిపోని టెక్నిక్, బలమైన ఫుట్‌వర్క్.. ఇలా అన్నింటా ఆస్ట్రేలియా బౌలర్లకు సవాల్ విసిరారు కోహ్లీ, పుజారా. అందుకనే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఆస్ట్రేలియా పర్యటన అంటే చాలు పరుగుల వీరులైన ఈ ఐదుగురి పేర్లు అభిమానుల మదిలో మెదులుతాయి.
సచిన్ టెండూల్కర్ – ఆస్ట్రేలయాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అతి కొద్దిమంది క్రికెటర్లలో సచిన్ ఒకడు. భారత క్రికెటర్లలో ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసింది కూడా అతడే. బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి పేస్ దళాన్ని స్పిన్ మాంత్రికుడు అయిన దివంగత షేన్ వార్న్(Shane Warne)కు నిద్రలేని రాత్రులను మిగిల్చిన సచిన్ కంగారూల గడ్డపై దంచికొట్టాడు. తన ఆధిపత్యాన్ని చాటుతూ మాస్టర్ బ్లాస్టర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు, 7 ఫిఫ్టీలతో 1,809 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్.. 241 నాటౌట్.
Sachin, Down Under!
Just 15 seconds into this video, and it’s sure to make your day!pic.twitter.com/hKITXW7GTw
— House_of_Cricket (@Houseof_Cricket) November 19, 2024
విరాట్ కోహ్లీ – సచిన్ వారసుడిగా ముద్రపడిన కోహ్లీ ఆస్ట్రేలియా అంటే చాలు రెచ్చిపోతాడు. ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్(Sledging) చేసి కవ్విస్తే చాలు తన ఉగ్రరూపం చూపిస్తూ శతకాలు బాదేస్తాడు. అలా కోహ్లీ ఇప్పటివరకూ కంగారూ నేలపై 6 సెంచరీలు కొట్టాడు. కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ 54.08 సగటుతో 1,352 పరుగులు బాదేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 6 శతకాలు, 4 అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోర్.. 169.
On This Day in 2019, Virat Kohli Became the First Asian Captain to win a test series in Australia and the Rest is History ! 🇮🇳🐐
Winning the Test Series in Australia ain’t easy as King Kohli made it look like.
(1/n) pic.twitter.com/bzci0L5o9T
— GAUTAM (@indiantweetrian) January 7, 2024
వీవీఎస్ లక్ష్మణ్ – ఆస్ట్రేలియాపై సొగసరి బ్యాటింగ్‌తో అలరించిన లక్ష్మణ్ ఆ తర్వాత వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అనే పేరుతో పాపులర్ అయ్యాడు. ద్రవిడ్ అండగా ఈ తెలుగు క్రికెటర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆసీస్ పేస్ దళానికి ముచ్చెమటలు పట్టిస్తూ సెంచరీలతో గర్జించాడు. వాళ్ల గడ్డపై ఈ హైదరాబాదీ బ్యాటర్ 1,236 రన్స్ సాధించాడు. నాలుగేసి చొప్పున సెంచరీలు, అర్ధ శతకాలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై అతడి అత్యధిక స్కోర్.. 178.
✨ The Wall stands tall ✨
Rahul Dravid’s 233 and 72* in Adelaide in 2003 has been voted by fans as the greatest Indian Test performance in Australia this century 🙌 https://t.co/v44fkzydCn #AwesomeInAus pic.twitter.com/li9KZMBio1— ESPNcricinfo (@ESPNcricinfo) November 18, 2024
రాహుల్ ద్రవిడ్ – ‘ది వాల్’గా భారత జట్టు టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ద్రవిడ్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. 2000 సంవత్సరంలో ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయాడు. తన జిడ్డు ఆటతో ఆసీస్ పేసర్ల మతిపోగుడతూ టీమిండియా ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ద్రవిడ్ ఖాతాలో 1,143 పరుగులు ఉన్నాయి. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు బాదిన ద్రవిడ్ అత్యధిక స్కోర్ ఎంతంటే.. 233.
India’s Tour of Australia
Rahul Dravid won a Test for India for the first time in 22 years, when he scored 233 and 72* at the Adelaide Oval.
He was well supported by VVS Laxman (148) and Ajit Agarkar (6 for 41).#AUSvIND pic.twitter.com/uuKYL6yp70
— Cricketopia (@CricketopiaCom) November 17, 2024
ఛతేశ్వర్ పూజారా – ద్రవిడ్ తర్వాత ‘నయావాల్’గా ముద్ర పడిన ఛతేశ్వర పూజరా ఆ పేరుకు తగ్గట్టు ఆడాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో అచ్చం ద్రవిడ్ లెక్కనే వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ భాగస్వామ్యాలు నిర్మించాడు. 2018, 2020లో భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో పుజారా పాత్ర ఎనలేనిది.
వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant)తో కలిసి సిడ్నీ, మెల్బోర్న్ మైదానంలో అతడు భారత జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఈసారి స్క్వాడ్‌లో లేని పుజారా కంగారూ గడ్డపై 948 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్.. 195.