Russia president | భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఎప్పుడంటే..!
Russia president | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది.
Russia president : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది. పర్యటన తేదీల ఖరారుపై భారత్‌తో చర్చిస్తున్నామని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ భారత పర్యటన ఖరారైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది.
గత నెలలో బ్రిక్స్ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన మోదీ.. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ ఏడాది ఇప్పటికే ఇరువురు నేతలు రెండుసార్లు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ ఇప్పటికే పలుమార్లు రష్యాకు సూచించారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి సహకారం అందిస్తామని మోదీ చెప్పారు. అందులో భాగంగా అప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను మాస్కోకు పంపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

