Viral Video | ఓ వివాహ వేడుకలో (UP Wedding Procession) బంధువులు నోట్ల వర్షం కురిపించారు. రూ.లక్షల రూపాయలను అతిథులపై వెదజల్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral Video).
పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడి బంధువులు కొంతమంది ఇళ్లు, జేసీబీలపైకి ఎక్కారు. ఈ సందర్భంగా ఊరేగింపుకు హాజరైన అతిథులపై నోట్ల వర్షం కురిపించారు. రూ.100, రూ.200, రూ.500 నోట్లను వెదజల్లారు. ఇందుకోసం మొత్తం రూ.20 లక్షలను ఖర్చు చేసినట్లు (Guests Shower Rs 20 Lakh Cash) తెలిసింది. గాల్లో ఎగురుతున్న నోట్లను దక్కించుకునేందుకు ఊరి ప్రజలు, అతిథులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ డబ్బును అవసరమైన వారికి ఇవ్వాల్సిందిగా సూచించారు. ‘ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిల పెళ్లిళ్లు జరిగేవి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. మరికొందరు ‘ఆదాయపు పన్ను కార్యాలయానికి డయల్ చేయాలి’ అంటూ సరదాగా చమత్కరిస్తున్నారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించిన సర్కార్
Assembly elections | మహారాష్ట్రలో నెమ్మదిగా కొనసాగుతున్న పోలింగ్.. 9 గంటల వరకూ ఎంత శాతం అంటే..?
AUS vs IND: సర్ఫరాజ్ ఫీల్డింగ్ చూసి.. పగలబడి నవ్విన కోహ్లీ, పంత్.. వీడియో