న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తద్వారా ఎల్పీజీ వంట గ్యాస్‌కు కొరత తదితర కారణాలతో భారత్‌లో మార్చి మొదటి 15 రోజుల్లో వంట గ్యాస్ వినియోగం 17 శాతం తగ్గిపోయింది. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో గ్యాస్ వినియోగం 1.147 మిలియన్ టన్నులకు పడిపోయిందని తాజా డాటా వెల్లడించింది. నిరుడు మార్చిలో ఇదే సమయంలో 1.387 మిలియన్ టన్నుల గ్యాస్‌ను పౌరులు వినియోగించారు. నిరుడు ఫిబ్రవరిలో వినియోగించిన 1.557 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 26.3 శాతం తక్కువ. గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.