– మిర్యాలగూడ ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి
మిర్యాలగూడ, జూలై 27 : మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ స్థాయి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించి మాట్లాడారు. డివిజన్ స్థాయి పరిధిలో ఏ శాఖ పరిధి లోనైనా సమస్య ఉన్నట్లయితే ప్రజావాణి ద్వారా తమ వినతి పత్రాన్ని అందజేయాలని, ఆయా సమస్యలను సంబంధిత శాఖ ద్వారా సత్వర పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 12 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ పరిధిలో 3, పెద్దవూర తాసీల్దార్ కార్యాలయం ఒకటి, మాడుగులపల్లి తాసీల్దార్ కార్యాలయం ఒకటి, తాసీల్దార్ కార్యాలయం నిడమనూరు 1, త్రిపురారం తాసీల్దార్ కార్యాలయం రెండు, వేములపల్లి తాసీల్దార్ కార్యాలయం ఒకటి, దామరచర్ల తాసీల్దార్ కార్యాలయం ఒకటి, మిర్యాలగూడ మున్సిపాలిటీ 1, మిర్యాలగూడ ఆర్ అండ్ బి, డిఈఈ కార్యాలయానికి ఒకటి ఫిర్యాదులు అందజేశారని ఆర్డీఓ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.