Sonam Wangchuk | సామాజిక కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్(Discharged) అయ్యారు. తనను ప్రాణాలతో కాపాడిన మేదాంత హాస్పిటల్ వైద్య సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన లడఖ్‌కు బయలుదేరే ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. కాగా, ఇటీవల జరిగిన నీట్ (NEET) వైద్య ప్రవేశ పరీక్షలో ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28న నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.
26 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సోనమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూలై 18న ఆయనను పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్చుక్ను మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం కాక్రోజ్ జనతా పార్టీ(సీజేపీ) 36 రోజుల పాటు చేపట్టిన ఆందోళనతో కేంద్ర విద్యా విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సమస్య సద్దుమణిగిన విషయం తెలిసిందే.