ముంబై: ఎన్సీపీ నేత సుప్రియా సూలే(Supriya Sule).. 2018లో బిట్‌కాయిన్ స్కామ్‌కు పాల్పడినట్లు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ రవీంద్ర పాటిల్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత నానా పటోల్ కూడా ఆ కుంభకోణంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై ఇవాళ సుప్రియా సూలే రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఆ అంశంపై మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను సుప్రియా ఖండించారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌పై పరువునష్టం కేసు దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రియా తెలిపారు. 2018లో బిట్‌కాయిన్ స్కామ్ డబ్బులతో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు సూలేపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఓటర్లను దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.