morning walk | ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ (Ghaziabad)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం మార్నింగ్ వాక్ (morning walk) చేస్తున్న వారిపైకి ఓ కారు (car) వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీ రోడ్డులోని రాకేష్ మార్గ్ కట్ సమీపంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్ చేస్తున్న వారిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో విహార్ కాలనీకి చెందిన విపిన్ శర్మ (47), కొత్వాలి ప్రాంతంలోని న్యూ కోట్గావ్ నివాసితులు మీను ప్రజాపతి (56), కమలేష్ (55), సావిత్రి దేవి (60) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మీను, సావిత్రిలు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక చికిత్స సమయంలో కమలేష్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
విపిన్ శర్మ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధవల్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Also Read..
Nirav Modi | పీఎన్బీ రుణ ఎగవేత కేసులో కీలక పరిణామం.. నవంబర్ 23న భారత్‌కు నీరవ్ మోదీ..?
Zubeen Garg | జుబీన్ గార్గ్‌కు విషమిచ్చి ఉంటారు.. గాయకుడి మృతి కేసులో కీలక ట్విస్ట్