Nirav Modi | పీఎన్బీ రుణ ఎగవేత కేసులో కీలక పరిణామం.. నవంబర్ 23న భారత్‌కు నీరవ్ మోదీ..?
Nirav Modi | పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank)కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో.. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) ప్రస్తుతం లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Nirav Modi | పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank)కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో.. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) ప్రస్తుతం లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్‌కు అప్పగించేందుకు (extradited) లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అతన్ని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్థిక నేరగాన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నీరవ్ మోదీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం 2018 డిసెంబర్లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేయగా.. 2019లో నీరవ్ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. 2021, ఏప్రిల్‌లో అతన్ని భారత్‌కు అప్పగించాలని ఆ నాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశించారు.
ఇక ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటిదాకా దేశ, విదేశాల్లోని రూ.2,596 కోట్ల విలువైన నీరవ్ ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబైలోని బ్రాడీ హౌజ్ పీఎన్బీ శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం జరిగింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి నకిలీ/మోసపూరిత ఎల్వోయూలతో నీరవ్, చోక్సీలు వేల కోట్ల రుణాలను పొందారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటిదాకా రూ.1,052.42 కోట్ల సొమ్మును పీఎన్బీ, ఇతర బ్యాంకులకు అప్పజెప్పినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్‌కు విషమిచ్చి ఉంటారు.. గాయకుడి మృతి కేసులో కీలక ట్విస్ట్
Truck Driver | మతి స్థిమితంలేని మహిళను ఎత్తుకెళ్లిన ట్రక్ డ్రైవర్..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

